Tamil director Bala: హీరోయిన్ ను కొట్టాడన్న వార్తలపై స్పందించిన డైరెక్టర్ బాల..! 3 d ago
తమిళ్ దర్శకుడు బాల తనకు కొట్టాడని మలయాళ నటి "మమిత బైజు' ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఈ విషయం పై దర్శకుడు బాల స్పందించారు. మమితను కొట్టానాని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. షూటింగ్ టైం లో మమిత మేకప్ వేసుకొని వస్తే.. ఎందుకు మేకప్ వేసుకున్నావ్? అంటూ కొట్టేలా చెయ్యి పైకిఎత్తేవాడిని.. అంతేకానీ చెయ్యి చేసుకోలేదు. తాను నా బిడ్డ లాంటిది అని బాల తెలిపారు.